ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
పట్టణంలోని శివారు ప్రాంతాల్లో తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని సిపిఎం పట్టణ నాయకులు బి.రాముడు డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని సుందరయ్య భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణ శివారు ప్రాంతాల్లో ప్రజలు తాగునీరు లేక అవస్థలు పడుతున్నారన్నారు. ప్రజల నుంచి ఇంటి, చెత్త పన్ను అన్ని రకాల పన్నులు వసూలు చేస్తూ సౌకర్యాలు కల్పించడంలో మున్సిపల్ అధికారులు వైఫల్యం చెందారన్నారు. ప్రతినెలా మున్సిపల్ సమావేశం జరుగుతున్నా సమస్యలు చర్చించడం లేదని తెలిపారు. 80 శాతం రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. వేసవి కాలమంటే అధికారుల్లో ముందు చూపు లేకపోవడంతోనే ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సిపిఎం నాయకులు బి.రాజు, సి.వీరేష్, డి.రవికుమార్, ఎ.సురేష్ కుమార్, బి.రాజు, ఎం.అబ్దుల్లా పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న రాముడు










