Jan 04,2023 23:50

ఉత్సవాలకు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

ప్రజాశక్తి-చోడవరం
త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు బుధవారం స్థానిక హార్డింగ్‌ రెస్ట్‌ హౌస్‌ వద్ద స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హార్డింగ్‌ రెస్ట్‌ హౌస్‌ ప్రాంగణంలో రూ.5 కోట్లతో విశ్వభారతి సంస్కృత విభాగానికి చెందిన హాలును ఏర్పాటు చేస్తామన్నారు. ఆధ్యాత్మికత సంగీతాలకు ఆలవాలమైన చోడవరానికి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో కోనసీమ జిల్లా ఏడిద గ్రామం నాదస్వర కచేరి, స్థానిక గాయకులిచే గాత్ర కచేరి, విజయరామరాజుపేట కోలాట బృందంచే కోలాటం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌జి.శర్మ త్యాగరాజ సంగీత పాఠశాల ట్రస్ట్‌ నిర్వాహకులు రాయవరపు నానాజీ, ఎంపీపీ గాడి కాసు, స్థానిక సర్పంచ్‌ బండి శ్రీను, కమిటీ సభ్యులు టీవీ రమణ, రాంబాబు, పుల్లేటి సతీష్‌, దేవరపల్లి సత్య, మూడేళ్ల శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.