ఆంధ్రుడు త్యాగజీవే
కానీ భోగజీవి కాడు
ప్రొట్టిశీరాముల త్యాగం వ్యర్ధమై
రెండు అర్ధాలై
విడిపోయి ఓడిపోయాము !
మన భాష విషయంలో
కేంద్రానిది మంధర పాత్రే కదా !
అన్ని రాష్ట్రాల శిశువులకు
కేంద్రం నుండి క్షీరమందితే
మనకు నీరు కూడా
లేక నోరు ఎండుతోంది !
ప్రత్యేకహోదా సవతి తల్లి
పండగ పూట పెట్టే
తాయిలం కదా !
ప్రతీ బడ్జెట్ ఒక ఎండమావి
మన ఆంధ్రా ఎండిపోయిన బావి
రైలు బడ్జెట్లన్నీ
పట్టాలు తప్పిన రైళ్ళే
గద్దెల నిండా
గద్దలే !
నీటి ప్రాజెక్టులన్నీ
ఏటి పాలే
విశాఖ ఉక్కు అంటే
కార్పొరేట్ హక్కుగా మార్చే
కుట్రలే !
ఇక ఈ దేశం
ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ?!
- వీరేశ్వరరావు మూల
9494746228