త్యాగధనులు రేనాటి సూర్యచంద్రులు
- రేనాటి సూర్యచంద్రుల సంస్మరణ సభ
ప్రజాశక్తి - నంద్యాల
రేనాటి సూర్యచంద్రులుగా పేరుగాంచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళ రెడ్డిలు త్యాగధనులని అంతర్జాతీయ శాస్త్రవేత్త డా.కె.రవీంద్రనాథ్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో రేనాటి సూర్యచంద్రులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళ రెడ్డి సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల పట్టణములో రేనాటి సూర్యచంద్రుల సంస్మరణ కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కర్నూలుకు చెందిన లలితా కళాసమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య రచించిన ''రేనాటి చంద్రుడు'' పుస్తకాన్ని అతిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పత్తి ఓబులయ్య మాట్లాడుతూ కలియుగ దాన కర్ణుడిగా పేరుగాంచిన బుడ్డా వెంగళ రెడ్డికి దాతృత్వములో ఎవరు సాటి లేరన్నారు. రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డా. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దాన, శౌర్యవీరులను స్మరించుకోవడం మన కనీస బాధ్యతని ఉయ్యాలవాడ, బుడ్డా వెంగళరెడ్డిల స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలని పేర్కొన్నారు. సూరన సారస్వత సంఘం అధ్యక్షులుడా. సహదేవుడు, కళారాధన సాంస్కతిక సంస్థ కార్యదర్శి డా.రవి కృష్ణ, నంది అవార్డు గ్రహీత పల్లేటి కులశేఖర్ ,డా. ఉదయ శంకర్‌లు ప్రసంగించారు. శ్రీశైల పబ్లిక్ స్కూల్ విద్యార్థుల సాంస్కతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. కార్యక్రమంలో కర్నాటి రామకృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, నంది రైతు సమాఖ్య ప్రతినిదులు చంద్రశేఖర్ రెడ్డి ఓబులపతి, రఫీ, కృష్ణారెడ్డి, పోచా ఈశ్వర్ రెడ్డి, నారాయణరెడ్డి, కొప్పుల ప్రసాద్, శేషఫణి, నీలకంఠమాచారి, బాలచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.










