బహుజన సాంస్కృతిక వారోత్సవాల్లో స్టీల్ సిఎండి అతుల్‌భట్
ప్రజాశక్తి- ఉక్కునగరం : త్యాగధనుల జీవితాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్టీల్‌ప్లాంట్ సిఎండి అతుల్ భట్ అన్నారు. ఉక్కునగరం సిడబ్లూసీ-1లో స్టీల్ ప్లాంట్ ఎస్‌సి, ఎస్‌టి అసోసియేషన్ ఆధ్యర్యంలో బహుజన సాంస్కృతిక కార్యక్రమంలో మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతీరావు ఫూలే వంటి మహానుభావులు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకోవాలన్నారు. యువత వారి జీవితాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. సభాద్యక్షులు బోండా తౌడన్న మాట్లడుతూ సంఘం శరణం గచ్చామి ద్వారా అంబేడ్కర్ ఫిలాసఫీ నాటక రూపంలో తెలుగులో అందిస్తున్నట్లు వెల్లడించారు.తర్వాత జ్యోతి రావు ఫూలే జీవిత విశేషాలను దృశ్యరూపంలో అందిస్తామన్నారు. అసోసియేషన్‌జనరల్ సెక్రెటరీ బయ్యే మల్లయ్య మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా అన్ని అసోసియేషన్స్, యూనియన్స్ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిజిఎం(హెచ్‌ఆర్) కల్లూరి శ్రీనివాసరావు, అడిషనల్ డిసిపి క్రైమ్ డి గంగాధరం, స్టీల్ గుర్తింపు యూనియన్ జనరల్ సెక్రెటరీ డి ఆదినారాయణ, మోహన్‌బాబు, గణేష్, పుల్లారావు, వేణు గోపాలరావు, ఎల్‌వి రమణ పాల్గొన్నారు. ముందుగా అంబేడ్కర్, బిర్శ ముండా, జగ్జీవన్‌రామ్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.










