సుందరయ్యకు ఘన నివాళి
ప్రజాశక్తి - యంత్రాంగం
సిపిఎం మొదటి అఖిల భారత ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి సందర్భంగా శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో జిల్లాలోని ముఖ్యకేంద్రాల్లో సుందరయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, కొన్ని చోట్ల సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి, ఆయా కేంద్రాల్లో నాయకులు మజ్జిగ పంపిణీ చేశారు.
తాళ్లరేవు : తన యావదాస్తిని, తన జీవితాన్ని కార్మిక, కర్షక ప్రజల కోసం త్యాగం చేసిన వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య త్యాగ ధనుడని సిపిఎం జిల్లా నాయకులు కెఎస్. శ్రీనివాస్ అన్నారు. ప్రజా సంఘాల భవనంలో శుక్రవారం సిపిఎం మండల కన్వీనర్ టేకుమూడి ఈశ్వరరావు అధ్యక్షతన పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సభ జరిగింది. సభలో కె.ఎస్. శ్రీనివాస్ మాట్లాడుతూ దున్నేవాడిదే భూమి అనే నినాదంతో తన యావదాస్తిని పేద ప్రజలకు పంచి పెట్టి, కూలీలు, మహిళలు, దళితులకోసం పనిచేసిన వ్యక్తి సుందరయ్య అన్నారు. తొలుత తాళ్లరేవు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మజ్జిగ కేంద్రాన్ని పార్టీ జిల్లా నాయకులు కె.ఎస్. శ్రీనివాస్, టేకుమూడి ఈశ్వరరావు, సి.హెచ్. శ్రీనివాస్ ఉంగరాల వెంకటేశ్వర రావు, అత్తిలి బాబురావు, వళ్లు రాజబాబు ప్రారం భించారు. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు ఎలిపె నాగేశ్వరరావు, కూలి సంఘం నాయకులు అనంతలక్ష్మి, గోడి భాస్కరరావు, తణుకు రాజు, రాంబాబు, దేవాబత్తుల శ్రీనివాస్, కౌలు రైతు నాయకులు చల్లా సంతోష్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దుప్పి అదష్టదీపుడు, గుత్తుల మల్లేశ్వరరావు, ఎండియు డబ్ల్యూఏ అధ్యక్షుడు పెయ్యల రమేష్ కుమార్ పాల్గొన్నారు. కాకినాడ సుందరయ్య భవన్‌లో కె.వీరబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్, జిల్లా నాయకులు దువ్వ శేష బాబ్జి మాట్లాడుతూ సుందరయ్య బాల్యం నుండే అసమానతలను ఎదిరించా రన్నారు. దక్షిణ భారత దేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించారని తెలిపారు. భారత పార్లమెంటులో తొలి ప్రతిపక్ష నేత అని, పార్లమెంటుకి సైకిల్‌పై వెళ్లిన నిస్వార్థ ప్రజా సేవకుడు అని నివాళులర్పించారు. కార్యక్రమంలో సిహెచ్. అజరు కుమార్, సిహెచ్. రమణి, పి.వీరబాబు, జుత్తుక శ్రీను, జి.దినేష్, ఎ.సుబ్రహ్మణ్యం, చైతన్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలో సిపిఎం గ్రామ కార్యదర్శి విజరు కుమార్ అధ్యక్షతన నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా కన్వీనర్ మోర్తా రాజశేఖర్ మజ్జిగ పంపిణీ ప్రారంభించారు. సీనియర్ నాయకులు చింతపల్లి రమణ, చీడిగ గ్రామ కార్యదర్శి జిత్తుగ శ్రీనివాస్, చంద్రరావు, నాగదేవి, పద్మ, వాసు,సాహిత్, రోహిత్, దినేష్ పాల్గొన్నారు. సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుంద రయ్య చిత్రపటం వద్ద వాకర్స్ జిల్లా కోఆర్డి నేటర్ అడబాల రత్న ప్రసాద్, రేలంగి బాపిరాజు, రాజా, సత్యనారాయణ, రాఘవరావు నివాళులర్పించారు. కార్మికులంతా కలిసి భోజనం చేద్దాం : వలస పాకల గ్రామంలో సిఐటియు ఆధ్వర్యంలో సిఐటియు నగర అధ్యక్షులు పి వీరబాబు అధ్యక్షతన కార్మికులంతా కలిసి భోజనం చేద్దాం కార్యక్రమంలో సుమారు మూడు వేల మందికి భోజనాలు సమాకూర్చారు. ఎపిఎంఎస్ ఆర్‌యు రాష్ట్ర కోశాధికారి డి.ప్రసాద్, యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు అన్నారం, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజకుమార్, యుటిఎఫ్ నాయకులు వివి రమణ సుంద రయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కెఎంఎంఆర్ ప్రసాద్ యుటిఎఫ్ ప్రభాకర్ వర్మ, సిఐటియు కాకినాడ నగర ఉపాధ్యక్షులు మేడిశెట్టి వెంకటరమణ, సిఐటియు జిల్లా కోశాధికారి ఎంవి రమణ, పరిశ్రమల కమిటీ నాయకులు కె.సత్యనారాయణ, శ్రీహరి, సంగీతరావు, ఈశ్వరరావు, మేడిశెట్టి శివ, టాటా మ్యాజిక్ యూనియన్ నాయకులు రమేష్, సత్తిబాబు మొదలైన వారు పాల్గొన్నారు. పెద్దాపురం యాసలపు సూర్యారావు భవనంలో శుక్రవారం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కరణం ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దువ్వా శేష బాబ్జి, సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు, సిపిఎం నాయకులు సిరపరపు శ్రీనివాస్,బాలం శ్రీనివాస్, కరణం శ్రీనివాస్, దారపురెడ్డి కృష్ణ, డి సత్యనారాయణ, క్రాంతి కుమార్,ఆర్ వీర్రాజు, చల్లా విశ్వనాథం తదితరులు పుచ్చపల్లి చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. కాజులూరు మండలం చేదువాడ అంబేద్కర్ విగ్రహం వద్ద పుచ్చపల్లి సుందరయ్య చిత్రపటానికి కురుపూడి భూ చక్రం, జిల్లా కౌలు రైతుల సంఘం కార్యదర్శి వల్లు రాజబాబు, మాతా రామకృష్ణలు నివాళులర్పించారు. కార్యక్ర మంలో వాసంశెట్టి సత్యనారాయణ సందాల సూర్యనారాయణ గంజా అప్పా రావు, దంగేటి శ్రీనివాసు పెంకి సత్యనారాయణ, మహిళలు పాల్గొన్నారు.
తాళ్లరేవులో సుందరయ్య వర్థంతి సందర్భంగా మజ్జిగ పంపిణీ చేస్తున్న సిపిఎం నాయకులు










