Jun 28,2023 21:13

మాట్లాడుతున్న మేయర్‌ స్రవంతి జయవర్ధన్‌

మాట్లాడుతున్న మేయర్‌ స్రవంతి జయవర్ధన్‌
త్యాగానికి ప్రతీక బక్రీద్‌ పండుగ
- మేయర్‌ స్రవంతి జయవర్ధన్‌
నెల్లూరు:నగర పాలక సంస్థ గౌరవ మేయర్‌ స్రవంతి జయవర్ధన్‌ ముస్లిం సోదర, సోదరీమణులకు ఈద్‌ ఉల్‌ అధా (బక్రీద్‌ )పండుగ శుభాకాంక్షలను బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. త్యాగం, సహనం బక్రీద్‌ పండుగ ఇచ్చే సందేశాలన్నారు. ''దైవ ప్రవక్త ఇబ్రహీం మహౌన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకొంటారన్నారు. భక్తి భావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో నగర ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలన్నారు.
ఈ పండుగ సోదర భావం,ఐక్యతకు ఆదర్శంగా నిలుస్తుంది'' అని అన్నారు. అల్లాV్‌ా ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మేయర్‌ అభిలషించారు.