Jun 29,2023 21:40

త్యాగాలకు ప్రతీక బక్రీద్‌ పండుగ

ప్రజాశక్తి - కడప అర్బన్‌
సమాజ హితం కోసం మహమ్మద్‌ ప్రవక్త హజరత్‌ ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్‌ పండుగ దానం, సాయం, త్యాగం వంటి సుగుణాలను ప్రతిబింబింపజేస్తుందని, ఈ పండుగ సమస్త మాన వాళికి ఆదర్శనీయమని ఉపముఖ్యమంత్రి ఎస్‌.బి.అంజాద్‌ బాషా సందేశం ఇచ్చారు. నగర శివార్లలోని మామిళ్లపల్లి ఈద్గా మైదానంలో మౌలానా ముఫ్తీ రహీముల్లా ఖాన్‌ ఖాస్మీ ఆధ్వర్యంలో బక్రీద్‌ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిం చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్యాగానికి ప్రతీకగా బక్రీద్‌ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ముస్లిములు జరుపుకుంటున్నారని చెప్పారు. సమస్త మానవాళి కోసం ప్రవక్త చేసిన త్యాగాలను ఆయన స్మరించుకున్నారు. బక్రీద్‌ ప్రార్థనల అనంతరం ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారన్నారు. ప్రతి మనిషి తనకు ఉన్నంతలో తోటి మనిషికి సాయం అందించే స్వభావాన్ని అలవర్చుకోవాని ప్రజలకు సందేశానిచ్చారు. . దేశం, రాష్ట్రం, జిల్లా సుభిక్షంగా ఉండాలని కోరారు. మదరసా సమస్యను సిఎం దష్టికి తీసుకెళతాం : అనంతరం స్థానికంగా మదరస సంస్థకు సంబంధించిన సమస్యను పలువురు ముస్లిం పెద్దలు ఉపముఖ్యమంత్రి దష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందింస్తూ ముఖ్యమంత్రి దష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ముస్లిం పెద్దలు హర్షం వ్యక్తం చేస్తూ ఉపముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో వైసిపి నేతలు అఫ్జల్‌ ఖాన్‌, ఎస్‌.బి.అహ్మద్‌ ఖాన్‌, ఉమెర్‌, కార్పొరేటర్‌ షఫీ, ఇతర మైనారిటీ, స్థానిక నాయకులు, ముస్లిం మత పెద్దలు, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అమీర్‌బాబుకు బక్రీద్‌ శుభాకాంక్షలు : బక్రీద్‌ పండుగ సందర్భంగా అమీర్‌ బాబును టిడిపి నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం టిడిపి నగర ఉపా ధ్యక్షులు కొండా సుబ్బయ్య కడప నియోజకవర్గ ఇన్‌ఛార్జి వి. ఎస్‌. ఆమీర్‌ బాబుకుపండుగ శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని అమీర్‌ బాబు నివాసంలో నగర ఉపాధ్యక్షులు వారి మిత్రబందం శాలువా కప్పి పూలమాలవేసి సత్కరించారు. ఈ సందర్భంగా కొండ సుబ్బయ్య మాట్లా డుతూ కులమతాలకు అతీతంగా బక్రీద్‌ పర్వదినాన్ని చేసుకోవాలని కోరారు. కడపలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ మతాలకు అతీతంగా పండు గలు చేసుకోవడం ఆన వాయితిగా వస్తుందన పేర్కొన్నారు. అమీర్‌బాబు మరెన్నో రాజకీయ పదవులు పొంది ఇంకా ఉన్న స్థాయికి ఎదగాలని ఆకాం క్షించారు. రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి నాసర్‌ అలీ, డివి జన్‌ చార్జీలు బండి జయ శేఖర్‌, 47 డివిజన్‌ జనార్దన్‌ రెడ్డి, శ్రీనివాసులు, కుమ్మరకుంట నరసింహ, జిల్లా బీసీ సెల్‌ ఉపాధ్యక్షులు నాదెళ్ల దస్తగిరి, రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి శ్రీనివాసులు, బలపలూరు వెంకటేష్‌, బండారు ప్రసాద్‌ పాల్గొన్నారు. చాపాడు : ఈదుల్‌ జూహాన్‌ (బక్రీద్‌) మండల పరిధిలోని ఈద్గా ప్రాంగణాల్లో ముస్లింలు గురువారం ఆనందోత్సాహాలతో ఘనంగా ఆచరించారు. బక్రీద్‌ పండుగ ప్రాముఖ్యతను మత పెద్దలు వివరించారు. మండలంలోని అన్ని మసీదులు, ఈద్గాలు ప్రత్యేక ప్రార్థనలతో మార్మోగాయి. చాపాడు, అల్లాడుపల్లె, మడూరు, వెదురూరు, రాజుపాలెం, తిమ్మాయపల్లె, కేతవరం, ఖాదర్‌పల్లె ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దువ్వూరు : ఈద్గా ప్రాంగణంలో ముస్లింలు బక్రీద్‌ పండుగను ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని మసీదులు, ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. త్యాగం, సహనం, ఐకమత్యానికి ప్రతీక బక్రీద్‌ అని మత గురువు సాబ్జు, అబ్దుల్‌ కరీం తెలిపారు. కానగూడూరు, నేలటూరు, యర్రబల్లె, క్రిష్ణంపల్లె, చింతకుంట, గుడిపాడు, జిల్లెల్ల, చల్లబసాయపల్లె, యల్లాలకొట్టాలులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రత్యేక వస్త్రధారణ, సంప్రదాయ దుస్తులతో ఆకట్టుకున్నారు. ఎస్‌ఐ శ్రీనివాసులు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీస్‌ బందోబస్త్‌ ఏర్పాట్లు చేశారు. జమ్మలమడుగు : ప్రవక్త ఇస్మాయిల్‌ జబీబుల్లా త్యాగ నిరతికి ప్రతీకగా ముస్లింలు పవిత్ర బక్రీద్‌ పండుగ చేసు కుంటారని, ఈ పర్వదినాన శక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్ప కుండా కుర్బానీ పాటిం చాలని జమ్మల మడుగు జామి యా మసీదు పీఠాధి పతి సయ్యద్‌ షా షాదిక్‌ భాషా ఖాద్రి పేర్కొన్నారు. పట్టణంలోని పెన్నానది ఒడ్డున గల అతి పురాత నమైన షాహి ఈద్గా మైదా నంలో జమ్మల మడుగు పట్టణం, మండల పరిధిలోని ముస్లింలు వేలాది సంఖ్యలో నమాజ్‌ ఆచరించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి సాదిక్‌ పాషా ఖాద్రి బక్రీద్‌ సారాంశాన్ని, ప్రాముఖ్యతను వివరించారు. పులివెందుల టౌన్‌ : పట్టణంలో బక్రీద్‌ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పేదలకు దానాలు చేస,ి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముద్దనూరు : త్యాగానికి ప్రతీకైన బక్రీద్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలు భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. తాడిపత్రి రహదారిలోని ఈద్గా, మండలంలోని యామవరం, ఉప్పలూరు, మంగపట్నం ఈద్గాల వద్ద మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింలు బక్రీద్‌ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. వేంపల్లె : త్యాగనిరతికి నిదర్శనం ఈదుల్‌ అజహ పండుగ (బక్రీద్‌) అని మౌలానా మహమ్మద్‌ రఫీ పేర్కొన్నారు. బక్రీద్‌ పండుగ సందర్భంగా పులివెందుల రోడ్డులోని బిస్మిల్లా మసీదులో, షాదీఖానా వద్దనున్న ఈద్గా మైదానంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్‌ఐ తిరుపాల్‌ నాయక్‌, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఖాజీపేట : బక్రీద్‌ పండుగ పర్వదినాన్ని ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయా ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత గురువులు అల్లాV్‌ా సందేశాన్ని చదివి వినిపించారు. దుంపలగట్టు, కొత్తపేట, చెన్నముక్కపల్లె ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దుంపలగట్టు ఈద్గాలో టిడిపి ఆవిర్భావ రాష్ట్ర సీనియర్‌ నేత రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.