ప్రజాశక్తి-డుంబ్రిగూడ:విద్యార్థులు సాంకేతిక పట్యాబ్‌లను ఇస్తున్న ప్రజాప్రతినిధులు రిజ్ఞానాన్ని మరింత పెంపొందించుకునే దిశగా సిఎం జగన్మోహన్‌రెడ్డి ట్యాబ్‌లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారని ఎంపీపీ బాకా ఈశ్వరి, జడ్పిటిసి జానకమ్మలు చెప్పారు. కేజీబీవీ పాఠశాలలో శుక్రవారం స్థానిక మండల విద్యాశాఖ అధికారి వి.త్రినాధరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించారని, సాంకేతిక విద్యా ప్రమాణాలను విద్యార్థులు అందిపుచ్చు కోవాలన్నారు.మండలంలోని పది ఆశ్రమ పాఠశాలలో 756 మంది విద్యార్థులకు ట్యబ్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, వైస్ సర్పంచులు పాల్గొన్నారు.
ముంచింగిపుట్టు:గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చవివే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ అరిసెల సీతమ్మ అన్నారు. మండల కేంద్రంలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేశారు. మండలంలో 3063 మంది విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ1 సత్యనారాయణ, మండల విద్యాశాఖ అధికారి చెల్లయ్య, వైసీపీ మండల అధ్యక్షులు పాంగి మల్లికార్జునరావు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుడు మాణిక్యాలరావు పాల్గొన్నారు.










