ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం
పాఠశాలల్లో సాంప్రదాయ పద్దతుల్లో కాకుండా సరికొత్త ఈ లెర్నింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలనే లక్ష్యంలో భాగంగా ఈట్యాబ్‌లను పంపిణీ చేస్తున్నట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు తెలిపారు. కొండపల్లి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో జరిగిన ఈ ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమంలో 8వ తరగతి విద్యార్థిని విద్యార్థినులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మన మండలంలో 693 మంది విద్యార్థులకు గాను 180 ట్యాబుల్ మొదటి విడతగా గురువారం పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో 110 ఇబ్రహీంపట్నం హైస్కూల్లో 70 ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా హజరైన వసంత మాట్లాడుతూ విద్యార్థులు ట్యాబ్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రూ.2కోట్లతో కొండపల్లిలో హైస్కూలును అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. కొండపల్లిలో బాలికల పాఠశాలలో జూనియర్ కళాశాల బాలుర పాఠశాలలోఐటిఐ కళాశాలల ఏర్పాటుకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. జాతీయ రహదారి ప్ర క్కనే ఉన్న బాలికల పాఠశాల వద్దజాతీయ రహదారిని దాటేందుకు పుట్ ఓవర్‌బ్రిడ్జి నిర్మాణానికి తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు స్థానిక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.










