Mar 12,2023 23:40

రామకృష్ణాపురంలో తవ్వి వదిలేసిన రహదారి

ప్రజాశక్తి - ఆరిలోవ : 13వ వార్డు పరిధి కేంద్రకారాగారం ఎదురుగా గల రామకృష్ణాపురంలో రహదారులు వేసేందుకు గత ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించారు. కాలువలు, యుజిడి పనులు పూర్తి చేశారు. తరువాత సాధారణ ఎన్నికల కోడ్‌ రావడంతో పనులు ఆపేశారు. ఎన్నికల తరువాత కొంతవరకు రహదారులు నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. రెండు ప్రధాన వీధుల్లో బిటి రోడ్డు నిర్మాణం చేపట్టారు. మిగతా వీధులను తవ్వేసి అలాగే వదిలేశారు. సుమారు రెండేళ్లు అయినా తిరిగి పనులు ప్రారంభించలేదు. అసంపూర్తి పనులతో వీధులన్నీ చిందరవందరంగా కనిపిస్తున్నాయి. చిన్న చిన్న రాళ్లు తేలిపోవడంతో స్థానికులు నడిచేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం వస్తే చాలు వీధులన్నీ బురదతో అధ్వానంగా మారి రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని స్థానికుల వాపోతున్నారు. యుజిడి పనులు పూర్తయినా ఇంకా ప్రధాన పైపు లైన్‌కు అనుసంధానం చేయలేదు. వర్షాకాలంలో లోతట్టు వీధులు ముంపునకు గురవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా పూర్తిచేయని రహదారులను పూర్తి చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.