మాట్లాడుతున్న డైరెక్టర్
ప్రజాశక్తి-మాడుగుల:స్థానిక నటీ నటులకు అవకాశం కల్పించే విధంగా త్వరలో వెబ్ సిరీస్ ప్రారంభిస్తామని బుల్లితెర అసోసియేట్ డైరెక్టర్ ప్రబల సాయి కుమార్(సాయి తేజ) తెలిపారు. ఇటీవల కాలంలో బిగ్ బాస్ షో తోపాటు, జాక్ పాట్, కబడ్డీ(జెమిని)నంబర్ వన్ యారి విత్ రానాతో పాటు వివిధ షోలకు అసోసియేట్ దర్శకుడుగా ఆయన మంచి గుర్తింపు పొందారు. మాడుగులకు చెందిన జబర్దస్త్ నటులు ప్రసాద్‌తో కలిసి గురువారం ఆయన వివరాలు తెలిపారు. వెబ్ సిరీస్ నిర్మాణం కోసం కథలు సిద్దం చేశామని, స్థానిక నటులకు సైతం అవకాశం కల్పిస్తామని, ఇందుకోసం త్వరలో సెలక్షన్స్ ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఒక సినిమా సైతం చిత్రీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.










