ఇంటర్‌నెట్‌డెస్క్: యూజర్లను ఆకట్టుకునేందుకు వాట్సాప్ కసరత్తు చేస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ ఆకర్షణీయంగా మారుతోంది. తాజాగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తరహాలో త్వరలో మరిన్ని ఎమోజీ రియాక్షన్స్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఇక యూజర్లు వచ్చే మెసేజ్‌లకు డిఫరెంట్ ఎమోజీలతో రిప్లే ఇవ్వొచ్చు. అయితే ,ఈ ఫీచర్ మొదట వాట్సాప్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానుంది. అనంతరం ఇతర వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి తెస్తుందని వాబీటాఇన్ఫో పేర్కొంది. ఈ అప్‌డేట్ డెస్క్‌టాప్ యూజర్లకు కూడా అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది.
వాబీటాఇన్ఫో ప్రకారం.. ప్రస్తుతం వాట్సాప్ లైక్, లవ్, లాఫ్ ఆశ్చర్యం , విచారం, ధన్యవాదాలు అనే ఆరు ఎమోజీ రియాక్షన్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. యూజర్ల కోరిక మేరకు ఈ రియాక్షన్స్‌కు అదనంగా మరిన్ని ఎమోజీలను తీసుకురావాలని వాట్సాప్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ ఫీచర్లు ప్రయోగాత్మక దశలో ఉన్నట్లు తెలిపింది. కాగా..బీటా యూజర్ల కోసం ఫేస్‌బుక్ మెసేంజర్ యాప్, ఇన్‌స్టాగ్రామ్ గతేడాది ఆగస్టులోనే ఈ కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే..










