ప్రజాశక్తి- కె.కోటపాడు
జిల్లాలో నూతనంగా నిర్మాణాలు పూర్తి చేసుకున్న కె.కోటపాడు, గొలుగొండ పోలీస్ స్టేషన్ భవనాలను ఉన్నతాధికారుల ఆదేశాలతో త్వరలో ప్రారంభిస్తామని జిల్లా ఎస్పీ గౌతమిశాలి తెలిపారు. బుధవారం కె.కోటపాడు పోలీస్ స్టేషన్ భవనాన్ని పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. కె.కోటపాడులో పోలీస్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని, తప్పనిసరిగా హెల్మెట్లు ధరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై గట్టి నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం రాత్రిపూట గస్తీ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అనకాపల్లి జిల్లాలో గతం కన్నా క్రైమ్ రేటు తక్కువగా ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆమె వెంట సీఐ తాతారావు, ఎస్సై ధనుంజరు తదితరులు ఉన్నారు.










