Aug 11,2023 21:43

పోస్టర్‌ను విడుదల చేస్తున్న చంద్రబాబు

కురుపాం: కురుపాంలో గల ప్రధాన కూడలి వద్ద కొద్ది రోజుల్లో అన్నా క్యాంటీన్‌ను ప్రారంభిస్తున్నట్లు కురుపాం నియోజకవర్గ టిడిపి నాయకులు వైరచర్ల వీరేష్‌ చంద్రదేవ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఐదు రూపాయలకే భోజనాన్ని అందిస్తున్న అన్నా క్యాంటీన్‌ను వైసిపి ప్రభుత్వం వచ్చాక అర్ధాంతంగా ఆపేసిందని, దీన్ని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంచడానికి త్వరలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు యుద్ధభేరి కార్యక్రమాన్ని విచ్చేసిన సందర్భంగా ఆయన చేతుల మీదగా కురుపాంలో అన్నా క్యాంటీన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ అన్నా క్యాంటీన్ని పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.