Sep 28,2023 22:17

ప్రజాశక్తి-అమలాపురం
త్వరలో ప్రారంభం బిసి కుల గణన ప్రారంభమవుతుందని, బిసి కులాలను జాగృతం చేస్తూ పలు సమావేశాలు నిర్వహిస్తామనిఎంఎల్‌సి కుడుపూడి సూర్య నారాయణ అన్నారు. తన కార్యాలయం లో గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కి కతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా కుల గణన జరగాలని తాము కోరుతున్నాం అని ఇప్పటి వరకు పాలకులు పట్టించుకోలేదన్నారు. అయితే సిఎం జగన్‌ ఈ విషయం లో ముందుకు వచ్చి జి ఓ ఇచ్చారని అన్నారు. బిసి ల అభ్యున్నతికి పోరాటం చేస్తానని కుడుపూడి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మట్టపర్తి నాగేంద్ర, కుడుపూడి త్రినాథ్‌, యనమదల కరుణాకర్‌, గుత్తుల సుబ్రహ్మణ్యం, దండుమెను రూపేష్‌, గుత్తుల ధర్మారావు, కడలి దుర్గ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.