Mar 05,2023 16:38

పబ్లిక్ హెల్త్ డిఈఈ గంగాధర్

త్వరలో అమృత్ ఫేస్ 2 పనులు పూర్తి..
నంద్యాల ప్రజల దాహార్తి ని తీర్చడమే అమృత్ లక్ష్యం...
పబ్లిక్ హెల్త్ డిఈఈ గంగాధర్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్

      నంద్యాల పట్టణ ప్రజల దాదార్తిని తీర్చడమే లక్ష్యంగా అమృత్ ఫేస్ 2 పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తిగా అయితే పట్టణానికి ఎలాంటి నీటి సమస్య ఉండదు. నంద్యాల పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు వెలుగోడు రిజర్వాయర్ నుండి నంద్యాల పట్టణానికి అమృత్ స్కీం ద్వారా పైపులైన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ పనులు పూర్తి అవుతాయి. నంద్యాల పట్టణానికి రోజుకు 300 నుండి 500ల లక్షల లీటర్ల నీళ్లు అవసరమవుతాయని, ప్రస్తుత జనాభా కనుగుణంగా, విస్తరించిన కాలనీలకు కూడా నీటిని ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గంగాధర్ ప్రజాశక్తి ముఖాముఖి కి తెలిపారు. ఆయన మాటల్లోనే మరిన్ని వివరాలు...
అమృత్ స్కీం పనులు ఇప్పటి నుండి ప్రారంభమయ్యాయి?
డిప్యూటీ ఈ ఈ... అమృత్ స్కీం పనులు 2016 లో ప్రారంభమయ్యాయి. 2020 కి ఫస్ట్ ఫేస్ పూర్తి అవగా అదే పిరియడ్ పనులను  ఫేస్ 2 కింద  టేకప్ చేసి పనులు చేపడుతున్నాము.
ఏడేళ్ల నుండి పనులు జరుగుతున్నాయి? పనుల్లో జాప్యం జరుగుతుందనిపించట్లేదా?
డిప్యూటీ ఈ ఈ.. పనుల్లో జాప్యం వాస్తవమే..కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఆలస్యం జరుగుతుంది, స్లూవ్ వే నుండి చేయటం కోసం ఇరిగేషన్ అధికారుల నుండి అనుమతి తీసుకోకపోవడం  పనులు ముందుకు సాగలేదు. అందుకు సంబంధించిన ఫైలు సి ఈ కి పంపడం జరిగింది. అక్కడి నుండి సిడిఓకు ఫైల్ వెళ్ళింది. ఆగిపోయిన చోట పనులు చేయడం జరుగుతుంది .
ఈ పనులు ఎప్పటిలాగా పూర్తి అవుతాయి?
డిప్యూటీ ఈ ఈ... ఫేస్ 2 కింద జరుగుతున్న పనులు జూలై నాటికి పూర్తి చేస్తాం.. మెటీరియల్ కూడా సిద్ధంగా ఉంది ఇంకా మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. వెలుగోడు వద్ద కిలోమీటర్ మేర    పైప్ లైన్ పెండింగ్ ఉంది. పట్టణానికి రోజువారీగా మంచినీటిని ప్రజలకు అందజేసేలా చర్యలు తీసుకుంటున్నాం..
అమృత్ స్కీంకు బడ్జెట్ లేకపోవడం వల్లనే పనులు జరగడం లేదని ఆరోపణ ఉంది... మీరేమంటారు?
డిప్యూటీ ఈ ఈ... కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు పెండింగ్ ఉండడం వలన కూడా పనులు ముందుకు సాగలేక పోవడానికి కారణం. ఇప్పుడు ఆ సమస్య ఏమీ లేదు.. నిధులు వచ్చాయి.
అమృత స్కీమ్ కు ఎంత బడ్జెట్ కేటాయించారు! వివరించగలరు?
 డిప్యూటీ ఈ ఈ అమృత్ స్కిన్ కింద నీటి సరఫరా కొరకు  పైప్ లైన్ వేయడం కోసం రూ.137.34 కోట్లు  ప్రభుత్వం కేటాయించింది.
అందులో కేంద్రం రాష్ట్రము మున్సిపాలిటీ వాటా ఎంత?
డిప్యూటీ ఈ ఈ అమృత స్కిం కేంద్రం వాటా30 శాతం, మున్సిపాలిటీ వాటా 40.27 శాతం, రాష్ట ప్రభుత్వం వాటా 15 శాతం ఇవ్వడం జరుగుతుంది.
కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించారా?
డిప్యూటీ ఈ ఈ.. కాంట్రాక్టర్లకు సంబంధించి బిల్లులు చేయడం జరుగుతుంది. నిధుల సమస్య లేదు. 50 కోట్లు మున్సిపాలిటీకి వచ్చింది.. ఇప్పటికే 40 కోట్లు  బిల్లులు చేశాము. ఇంకా 7.50 కోట్లు బిల్లు చేయాల్సి ఉంది..
ట్రీట్మెంట్ ప్లాంట్ అంటున్నారు అది ఎలా?
డిప్యూటీ ఈ ఈ.. ప్రస్తుతం ఇంటర్ కనెక్షన్ పైప్లైన్ పనులు పట్టణంలో జరుగుతున్నాయి.. నేను పంప్ హౌస్ వద్ద ట్రీట్మెంట్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి దానిద్వారా పట్టణంలో ఇంటర్ కనెక్షన్ పైప్ లైన్ పనులు  జరుగుతున్నాయి..
సమ్మర్ స్టోరేజ్ టాంక్ వద్ద  మోటర్ వాటర్ కనెక్షన్స్ వర్క్స్ మరియు పైప్ లైన్లు కనెక్షన్ వర్క్స్ కొత్త 30 ఎం ఎల్ టి ఫిల్టేషన్ టాంక్ పనులు జరుగుతున్నాయి ఈ పనులు పూర్తి అయితే పట్టణానికి 35 వరకు నీటి సమస్య ఉండదు అలా డిజైన్ చేయడం జరిగింది..