పనులపై అడుగుతున్న డిపిఓ
ప్రజాశక్తి-నక్కపల్లి:నక్కపల్లిలో సంపద తయారీ కేంద్రాన్ని బుధవారం జిల్లా పంచాయతీ అధికారిణి శిరీషా రాణి సందర్శించారు. షెడ్డు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. షెడ్డు నిర్మాణానికి సంబంధించి మిగిలి ఉన్న పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని పంచాయతీ అధికారులకు సూచించారు. నక్కపల్లి సంపద తయారీ కేంద్రాన్ని శిక్షణ కేంద్రంగా ఎంపిక చేసినట్లు తెలిపారు. సంపద తయారీ,నిర్వహణపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.










