Jan 14,2023 00:04

జగనన్న కాలనీని పరిశీలిస్తునన్న కలెక్టర్‌

ప్రజాశక్తి-ఎస్‌.రాయవరం:మండలంలోని పలు గ్రామాలలో కలెక్టర్‌ రవిసుభాష్‌ శుక్రవారం ఆకస్మిక పర్యటన చేపట్టారు. దార్లపూడి, చినగుమ్ములూరు, పెదగుమ్ములూరు గ్రామాల సచివాలయాల పపరిధిలోని జగనన్న కాలనీలను సందర్శించారు. జగనన్న కాలనీలు త్వరితగతిని పూర్తి చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం కేటాయించిన లే అవుట్లలో కోర్టు కేసులు ఉంటే ప్రత్యామ్నాయ స్థలాలు గుర్తించి కేటాయించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొల్లబాబూరావు, ఎంపిడివో రామచంద్రమూర్తి, నాయకులు పాల్గొన్నారు.