Jan 21,2023 23:54

కోటవురట్ల మండలంలో పర్యటిస్తున్న అధకారులు

ప్రజాశక్తి-నక్కపల్లి:త్వరితగతిన గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని ఎంపీడీవో సీతారామరాజు సూచించారు. మండలంలోని శనివారం హౌసింగ్‌ డే సందర్భంగా చినతీనార్ల, ఉపమాక గ్రామాల్లో జగనన్న లేఅవుట్‌ లను హౌసింగ్‌ అధికారులు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ లతో కలిసి సందర్శించారు. గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. వేగవంతగా నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. గృహ నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారులతో మాట్లాడి అవగాహన కల్పించారు. లేఅవుట్‌లలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలన్నారు.
గొలుగొండ:మండలంలోని జోగంపేట గ్రామంలో సర్పంచ్‌ జువ్వల లక్ష్మి, వైస్‌ ఎంపీపీ నాగమణి ఆధ్వర్యంలో జగనన్న హౌసింగ్‌ లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. తమకు వేరొక చోట జగనన్న కాలనీ ఇస్తే అక్కడ నిర్మాణం చేస్తామని లబ్ధిదారులు చెప్పారు. అనంతరం తహశీల్దార్‌ ఆనంద్‌ మాట్లాడుతూ, గతంలో మంజూరు చేసిన 47 మంది లబ్ధిదారుల్లో ఎంతమందికి జగనన్న హౌసింగ్‌ కాలనీ కావాలో సోమవారం వచ్చి చెప్పాలని సూచించారు. లేఅవుట్‌ వేసిన తర్వాత హౌసింగ్‌ కావాలని వస్తే కుదరదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ డేవిడ్‌రాజు, ఏపిఎం మంగ, వివిధ శాఖల సిబ్బంది, జోగంపేట ఉప సర్పంచ్‌ లాలం స్వామినాయుడు, వైసిపి నాయకులు దేముడు పాల్గొన్నారు.
కోటవురట్ల:జగ్గంపేట, కైలాసపట్నం గ్రామాల్లో తహసిల్దార్‌ జానకమ్మ, ఎంపీడీవో చంద్రశేఖర్‌లు జగనన్న ఇళ్ల నిర్మానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ, గృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. తహశీల్దార్‌ జానకమ్మ మాట్లాడుతూ, లబ్ధిదారులకు సకాలంలో గృహ నిర్మాణ సామగ్రి అందించి, బిల్లులు చెల్లించాలని హౌసింగ్‌ ఇంజనీర్‌ జగదీశ్వరరావుకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ ఇంజనీర్‌ వర్మ, ఆర్‌బ్ల్యూఎస్‌ ఇంజనీర్‌ కరుణ, జగంపేట సర్పంచ్‌ రమణ, కైలాసపట్నం ఎంపీటీసీ సభ్యులు వెంకట రమణ, ఈఓపిఆర్‌డి ప్రేమ్‌ కుమార్‌, కైలాసపట్నం ఉపసర్పంచ్‌ నాగేశ్వరరావు పాల్గొన్నారు.