రికార్డులు పరిశీలిస్తున్న పిఒ
ప్రజాశక్తి-జిమాడుగుల:మండలంలో బీరం పంచాయతీ నూరుమామిడి గ్రామాన్ని శనివారం పాడేరు ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోజుకు 40 ఎకరాలు భూమి రీ సర్వే చేయాలని తహశీల్దార్ అప్పలస్వామికి సూచించారు. సర్వేకు వచ్చినప్పుడు అధికారులకు రైతులందరూ సహకరిం చాలన్నారు. తమ సరిహద్దులో వద్ద ఉన్న జంగిల్స్‌ను తొలగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ రామన్న దొర, సాయి, వీఆర్వోలు, గ్రామస్తులు పాల్గొన్నారు.










