Jan 27,2023 22:13

ప్రజాశక్తి - జీలుగుమిల్లి
                 మండలంలోని రౌతుగూడెం వద్ద నిర్మిస్తున్న చింతలపూడి ఎత్తిపోతల పథకం వంతెన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని క్వాలిటీ కంట్రోల్‌ చీఫ్‌ ఇంజినీర్‌ ఎన్‌.పుల్లారావు అధికారులకు సూచించారు. శుక్రవారం వంతెన పనులు జరిగిన తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించి వంతెన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వంతెనకు సంబంధించి నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ప్రసాద్‌, జంగారెడ్డిగూడెం డివిజన్‌ ఇఇ వై.కృష్ణయ్య, డిఇ శ్రీనివాస్‌, గాయత్రి ఏజెన్సీ ప్రాజెక్ట్స్‌ మేనేజర్‌ కె.అజ్మీర రవి, ఎజిఎం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.