
భోజనాన్ని పరిశీలిస్తున్న ఎంఇఒ
త్వరితగతిన పనులను పూర్తి చేయాలి
ప్రజాశక్తి-ఉదయగిరి:జగనన్న మనబడి నాడు-నేడు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మండల విద్యాశాఖ అధికారి 2 తోట శ్రీనివాసులు పేర్కొన్నారు. గురువారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దుర్గం పల్లి సర్వరాబాదు పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు-నేడు పనులలో నాణ్యమైన వస్తువులను వాడుతూ నాణ్యతగా పనులు పూర్తి చేయాలన్నారు. పూర్తిచేసిన ప్రతి కాంక్రీట్ స్లాబ్ ప్లాస్టింగ్స్ లకు ఉదయం, సాయంత్రం రెండు పూటల వాటర్ తో క్యూరింగ్ చేయాలని పలు సూచనలు చేశారు. నాడు నేడు పనులకు సంబంధించిన అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ప్రతి పనికి తీర్మానంలను తీర్మానాల రిజిస్టర్ లో నమోదు చేసి సభ్యులందరిచే సంతకాలు చేయించాలని ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు తెలిపారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని రుచి చూస్తూ భోజనం ఎలా ఉందని విద్యార్థులు అడగగా బాగుందని చెప్పడంతో సంతప్తి చెంది నిర్వాహకులను ప్రధానోపాధ్యాయులను ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం సర్వరాబాద్ ప్రాథమిక పాఠశాల ఐదవ తరగతి విద్యార్థులు పఠన అభ్యసన నైపుణ్యాలు సామర్థ్యాలలో అత్యున్నత ప్రతిభ కనబరచి నందుకు వారిని అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానో పాధ్యాయులు షేక్ జాఫర్ అహ్మద్, ఉపాధ్యాయులు పి. వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.