Jul 26,2023 21:50

టిడ్కో ఇళ్ల సముదాయాలను పరిశీలిస్తున్న డిప్యూటీ సిఎం, డిడ్కో చైర్మన్‌

ప్రజాశక్తి - సాలూరు : టిడ్కో ఇళ్ల సముదాయాలను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు ఆగస్టులో అందజేసేందుకు అధికారులు పనులు పూర్తి చేయాలని ఉపముఖ్యమంత్రి పి.రాజన్నదొర, ఎపి టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌ అధికారులను ఆదేశించారు. ఆగస్టు నాటికి లబ్ధిదారులకు ఇళ్లు అందజేయాలనే లక్ష్యాన్ని పూర్తి చేయాలని, ఆ దిశగా సాలూరులో నిర్మాణంలో ఉన్న టిడ్కో గృహ సముదాయాల నిర్మాణ ప్రగతిపై బుధవారం వారు తనిఖీ చేశారు. సాలూరు మున్సిపాల్టీలో పరిధిలో గల 1048 గృహాలు ప్రారంభోత్సవాలకు అందించే దిశగా నిర్మాణం జరుగుతున్నట్లు, వంటి పనులను ఇంజనీరింగ్‌, మునిసిపల్‌ అధికారులతో కలిసి పరిశీలించాలన్నారు. అలాగే గుమడాం వద్ద నిర్మిస్తున్న 1280 టిడ్కో ఇళ్లకు సంబంధించి (హౌసింగ్‌ అండ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌) పనుల పురోగతిని సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టింగ్‌ ఏజెన్సీ (వి.ఎన్‌.సి అండ్‌ శింఘన్‌) సిబ్బందితో కలిసి పర్యటించి తదుపరి వారితో సంయుక్తంగా చర్చించడంతో పాటుగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగష్టులో ఇళ్ల నిర్మాణాలను పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందజేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని అధికారులను, ఏజెన్సీని ఆదేశించారు. కార్యక్రమంలో టిడ్కో సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ నరసింహమూర్తి, మున్సిపల్‌ కమిషనర్‌ హనుమంతు శంకరరావు, ఇఇ జ్యోతి, డిఇ బాలకృష్ణ రెడ్డి, శశిధర్‌, సిఎల్‌టిసి కాంట్రాక్టింగ్‌ ఏజెన్సీ పాల్గొన్నారు.