ప్రజాశక్తి -నక్కపల్లి : మండలంలోని వేంపాడులో సచివాలయం ,రైతు భరోసా, హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులను, సంపద తయారీ కేంద్రాలను మంగళవారం జెడ్‌పి సిఇఒ శ్రీరామమూర్తి పరిశీలించారు. సకాలంలో భవన నిర్మాణాలు పూర్తిచేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు .భవనం ఆవరణంలో మొక్కలు నాటాలని సూచించారు.
.అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఒ సీతారామరాజుతో సమావేశమై, పంచాయతీల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై అడిగి తెలుసుకున్నారు. జెడ్‌పిటిసి గోసల కాసులమ్మ, మండల పరిషత్ ఉపాధ్యాయులు వీసం నానాజీ తదితరులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. మండల విద్యాశాఖ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని ,వర్షం పడినప్పుడల్లా ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఎంఇఒ డివిడి ప్రసాద్ సమస్యను సిఇఒ దృష్టికి తీసుకువెళ్లారు. సభ్యులతో మాట్లాడి ఆర్థిక సంఘం నిధులతో మరమ్మత్తు పనులు చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని ఎంపిడిఒకు సూచించారు. జలజీవన్ మిషన్ పనుల పురోగతిపై ఆరా తీసి త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు.కార్యక్రమంలో ఇఒపిఆర్‌డి వెంకటనారాయణ, పంచాయతీ కార్యదర్శులు రాజశేఖర్, శ్రీను ,బాబురావు ,కిరణ్, నర్సింగరావు పాల్గొన్నారు.
కోటఉరట్ల: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ సక్రమంగా అందజేయాల్సిన బాధ్యత అధికారులదేనని జిల్లా పరిషత్ సిఇఒ శ్రీరామమూర్తి అన్నారు మంగళవారం మండలంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలకు రూ.18కోట్ల జిఆ్ల పరిషత్ నిధులు మంజూరయ్యాయని, మండలానికి కేటాయించిన రూ.15లక్షలతో సకాలంలో అవసరమైన పనులు చేపట్టాలని సూచించారు. జెడ్‌పిటిసి ఉమాదేవి, ఎంపిడిఒ చంద్రశేఖర్, పిఆర్ జెఇ వర్మ,పాల్గొన్నారు.










