ప్రజాశక్తి - పాలకొండ : గారమ్మ కాలనీతో పాటు, మెయిన్ రోడ్డుకు వెళ్లకుండా అతి దగ్గర దూరాన్ని తగ్గించి పోతులగెడ్డ కల్వర్టు నిర్మాణం వీలైనంత త్వరలోనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువస్తామని శాసన మండలి విప్ విక్రాంత్ పేర్కొన్నారు. గురువారం ఘటాలడెప్పివీధి, శెగిడి వీధి సెంటర్లకు సంబంధించిన పోతులగెడ్డ కల్వర్టు నిర్మాణానికి విక్రాంత్, ఎమ్మెల్యే కళావతి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ఘటాలడెప్పి వీధి నుండి, గారమ్మ కాలనీ, మెయిన్ రోడ్డును కలుపుతూ ఉన్న పోతుల గెడ్డ కాలువపై కల్వర్టు నిర్మాణానికి 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.40 లక్షలు మంజూరుకు చర్యలు తీసుకున్నామన్నారు. అతి త్వరలోనే కల్వర్టు నిర్మాణం చేసి వినియోగంలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నగరపంచాయతీ వైస్‌ఛైర్మన్లు రౌతు హనుమంతరావు, పల్లా ప్రతాప్, కౌన్సిలర్లు నీలాపు శారదా శ్రీనివాసరావు, వెలమల మన్మధరావు, కడగల అనూరాధ వెంకటరమణ, తుమ్మగుంట అనూష శంకరరావు, తూముల కళావతి లక్ష్మణరావు, భాసూరు కాంతారావు, పల్లా ధనలక్ష్మిభాను, దుప్పాడ పాపి నాయుడు, కొంచాడ అరుణ్, కొరికాన గంగునాయుడు, కిల్లారి మోహన్, ఆకుల మల్లీశ్వరి కుమార్, కోరాడ రవి, కోరాడ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.