ట్విన్నింగ్ డ్రెస్ కాంపిటీషన్‌లో తల్లిదండ్రులు, విద్యార్థులు
ప్రజాశక్తి కడప అర్బన్
హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న నారాయణ స్కూల్లో ట్విన్నింగ్ డ్రెస్ కాంపిటీషన్ శనివారం నిర్వహించారు. ప్రిన్సిపల్ గీతా ఆధ్వ ర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్ధుల తల్లిదండ్రులు, విద్యార్ధులు ఒకే కలర్ దుస్తులు ధరించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ స్కూలులో పిల్లలతో కలసి పా ల్గొనడం ఆనందంగా ఉందన్నారు. తమ పిల్లలతో కలసి పాల్గొనే అవకాశం కల్పించిన నారాయణ స్కూల్ యాజమాన్యానికి కతజ్ఞతలు తెలిపారు.










