Jun 28,2023 20:17

జగనన్న కాలనీలో అధ్వానంగా వేసిన రోడ్డు

ప్రజాశక్తి - చిప్పగిరి
చిప్పగిరిలోని జగనన్న కాలనీలో రోడ్లను తూతూమంత్రంగా వేసి ప్రజాధనాన్ని స్వాహా చేసినట్లు మండల ప్రజలు విమర్శిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లు పనులు చేయించి చేతులు దులుపుకుంటున్నారని వాపోతున్నారు. జగనన్న కాలనీలో అన్ని వసతులూ ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేస్తున్న కృషి సంబంధిత అధికారుల లోపం వల్ల నాణ్యత లేకపోయింది. జగనన్న కాలనీ గ్రావెల్‌ రోడ్లు రాళ్ల రోడ్లుగా ఇప్పటికీ దర్శనమిస్తూనే ఉన్నాయి. జగనన్న కాలనీలోకి బైక్‌ వెళ్లాలంటే గుండ్లు రాల్లు, ముళ్లకంపలు ఉండడంతో చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. చిప్పగిరి జగనన్న కాలనీలో రోడ్ల అధ్వానస్థితిపై దృష్టి సారించాలని, నాసిరకంగా థర్డ్‌ పార్టీ నిర్మిస్తున్న గృహాలపై కలెక్టర్‌ దృష్టి సాధించాలని ప్రజలు కోరుతున్నారు.