ప్రజాశక్తి పాయకరావుపేట:గత సర్వసభ్య సమావేశంలో సమస్యలు పరిష్కారం కానప్పుడు మళ్ళీ అదే రీతిలో తూతూ మంత్రంగా సర్వసభ్య సమావేశం ఎందుకని మండల అధికారులపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మండల పరిషత్ కాంప్లెక్స్ ఆవరణలో శ్రీ శక్తి భవనంలో మంగళవారం సాధారణ మండల సర్వసభ్య సమావేశం మండల ఎంపీపీ పార్వతి అధ్యక్షతన నిర్వహించారు.గత సమావేశంలో సమస్యలు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించలేదని ఆవేదన చెందారు. ఆర్ అండ్ బి, విద్యుత్, హౌసింగ్ శాఖ, పంచాయత్ రాజ్, ఆర్డబ్ల్యూఎస్ వివిధ శాఖల అధికారుల పనితీరుపై ధ్వజమెత్తి నిలదీశారు. అధికారులు స్పందించకపోతే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. గ్రామాల్లో సమస్యలు పరిష్కరించలేకపోతున్నామని సర్పంచులు, ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్వోలు గ్రామ సచివాలయాలకు రాలేదని తెలిపారు. జిల్లా పరిషత్ నిధుల నుంచి గ్రామాల్లో బోర్లు మంజూరు చేస్తామని జెడ్పిటిసి లంక సూర్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు, దనిశెట్టి మాధవి, పల్లెల మణికంఠ స్వామి, ఈవోపీఆర్డి సిహెచ్ చంద్రశేఖరరావు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల శాఖ అధికారులు పాల్గొన్నారు










