
ప్రజాశక్తి - భట్టిప్రోలు
మండలంలోని వెల్లటూరులో శ్రీ రాధాకృష్ణ గ్రామ సంఘంలో సభ్యులైన కె రేవతి, రామారావు, ఇస్మాయిల్ కలసి తూటికాడ కషాయం శుక్రవారం తయారు చేశారు. ఎల్1 శివ నాగేశ్వరమ్మ ఆధ్వర్యంలో సుడిదోమ నివారణకు తూటికాడతో తయారు చేసిన కషాయం పిచికారి చేస్తే పూర్తిగా నివారించవచ్చని పేర్కొన్నారు. అలాగే ఆకు ముడత, నాము తెగులు నివారణకు వెల్లుల్లి, పచ్చిమిర్చితో తయారు చేసిన కషాయాన్ని వినియోగిస్తే పూర్తిగా పురుగు నివారణ జరుగుతుందని శివనాగేశ్వరమ్మ తెలిపారు. రసాయన ఎరువుల వాడకంతో వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో ప్రకృతిలో లభించే ఇలాంటి ఆకులతో కూడిన కషాయాలు తయారు చేసుకుని వినియోగిస్తే అటు ఖర్చు తక్కువతో పాటు అధిక లాభాలను పొందవచ్చునని సూచించారు. తూటికాడే కదా అని ఇస్మారచ్చ కొండ తగిన మోతాదులో కషాయం తయారు చేసుకుంటే చుడిదోమా పూర్తిగా పోతుందని అన్నారు.