ప్రజాశక్తి- యంత్రాంగం
తమ సమస్యలను పరిష్కరించాలని పర్యాటక శాఖ కాంట్రాక్టు, మేన్ పవర్, ఔట్సోర్సింగ్, డైలీ వేస్ కార్మికులు శనివారం సమ్మె ప్రారంభించారు. అరకులోయలోని పర్యాటకశాఖ హరిత హిల్ రిసార్ట్స్, పున్నమి వ్యాలి రిసార్ట్స్, రెస్టారెంట్లు మూతపడ్డాయి.
అరకులోయ:తక్షణమే టూరిజం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని ఏపీ టూరిజం కార్మికులు అరకులోయలోని హరిత వ్యాలీ సమ్మె శిబిరంలో ఆయన మాట్లాడుతూ, సమస్యలు పరిష్కరించాలని సుదీర్ఘ కాలం నుంచి కార్మికులు సమ్మె చేస్తున్నా టూరిజం యాజమాన్యం కనీసం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులందరికీ హెచ్.ఆర్ పాలసీని అమలు చేయాలన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. టూరిజం ఎండి కన్నబాబు, అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సమక్షంలో చర్చలు జరిగినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా పర్యాటకశాఖ అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
అనంతగిరి: సమస్యలు పరిష్కారానికి 2010 సంవత్సరంలో కుదుర్చుకున్న ఒప్పందల హామీలను పరిష్కరించకుంటే ఈ పోరాటం మరింత ఉదృతం చేస్తామని జెడ్పిటిసి దీసరి. గంగారాజు తెలిపారు. పర్యాటక శాఖలో పని చేస్తున్న డైలీ వేజ్, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరిం చాలన్నారు. సమ్మెకు సంపూర్ణ మద్దతుగా స్థానిక సీపిఎం జెడ్పిటిసి దీసరి.గంగరాజు, టోకురు సర్పంచ్ కె, మొస్యలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ, కార్మికులతో శ్రమ దోపిడి చేయించుకుంటున్నారన్నారు. బొర్రా గుహలతో పాటు అనంతగిరి మండలం టైడా, అనంతగిరి, హరితహిల్ రిసార్ట్స్, అరకు, మయూరి కార్మికులు గత 30 సంవత్సరాల నుండి నమ్ముకుని విధులు కొనసాగిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని తెలిపారు. కార్మికులకు కనీస వేతనాలు, రాయితీలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.సమాన పనికి సమాన వేతనం చెల్లించవలసి ఉన్నప్పటికీ దీన్ని అమలు చేయలేదని విమర్శించారు. ఈ పోరాటం ఇంతటితో ఆగదని కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపేవరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
చింతపల్లి:టూరిజం కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు పాంగి ధనుంజరు డిమాతండ్ చేశారు. ఈ మేరకు ఏపీ టూరిజం లంబసింగి (హరిత రిసార్ట్స్) కార్మికు లు చేస్తున్న సమ్మెలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, గతంలో చర్చల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం అన్యాయమన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మృతి చెందిన కార్మిక కుటుంబానికి అదే కేటగిరిలో తక్షణం ఉద్యోగం కల్పించాలన్నారు. డైలీ వేజ్ కార్మికులందరినీ ఆప్కాస్‌లో కలపాలన్నారు. యూనిట్లను తక్షణమే బాగు చేయాలని, కార్మికులకు బస్ పాస్, ఏజెన్సీ అలవెన్సులు, యూనిఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎపి టూరిజం లంబసింగి నాయకులు కుర్ర రఘురాం, చల్ల కృష్ణ, చేడంగి వరప్రసాద్, శ్యామల, పైలా గణేష్ పాల్గొన్నారు