ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:-మండూస్ తుఫాన్ ప్రభావంతో మండలంలోని 23 పంచాయతీ పరిధి గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు.చేతికి అందిన పంట అందికొచ్చే సమయంలో తుఫాన్ ప్రభావంతో గిరిజన రైతులు చినుకులు పడడంతో ఆందోళన చెందుతున్నారు. వరి కోతలు కోసిన రైతులు తార్పాల్లిన్ కవర్లను మూసేందుకు నిమగం అయ్యారు.
ఈ ఏడాది మండలంలోని విస్తారంగా వరి, రాగులు, సామాలు, రాజ్మా చిక్కుళ్ళు, చిరుధాన్యాలు పంట దిగుబడి అధికంగా వచ్చింది. ఈ సమయంలో పంట దెబ్బతింటే అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి ఉంటుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
హుకుంపేట: మండలంలోని పలుచోట్ల వర్షాలు పడుతుండటంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు జరగడంతో రైతులు భయపడుతున్నారు. సంవత్సరమంతా కష్టించి పండించిన పంట పొలాల్లో తడిస్తే ఆర్థికంగా నష్ట పోతామని రైతులు తెలిపారు.










