
రేణిగుంట (చిత్తూరు) : తుపాకీతో కాల్చుకొని ఆర్‌పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన రేణిగుంటలో ఆదివారం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన హరిపురం ఆనందరావు (30) ఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా రేణిగుంటలో విధులు నిర్వహిస్తున్నారు. రేణిగుంట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బ్యారక్స్ డ్యూటీలో ఉండి ఈరోజు తెల్లవారుజామున 4:15 గంటలకు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రేణిగుంట అర్బన్ సిఐ అంజు యాదవ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారుల ఒత్తిడి వల్లనా లేక ఇంకేమైనా కారణాలున్నాయా తెలియాల్సి ఉంది. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.