
పోస్టర్ ఆవిష్కరిస్తున్న అధికారులు
ప్రజాశక్తి-పెదబయలురూరల్:తహసిల్డారు కార్యాలయంలో మండల వినియోగదారుల సంఘం అధ్యర్యంలో వినియోగదారుల గోడ పత్రికలను తహశీల్దార్ రంగారావు చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తహసిల్దార్ రంగారావు మాట్లాడుతూ, తూనికలు, కొలతల పట్ల వినియోగదారుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా అధ్యక్షుడు బూడిద చిట్టిబాబు సంఘం సేవలో మంచి కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బూడిద చిట్టిబాబు, రమేష్, బాలరాజు, మండల అధ్యక్ష కార్యదర్శులు కూడా కృష్ణబాబు, దేవరాజు, సంజీవి బాబు పాల్గొన్నారు.