
ప్రజాశక్తి - వేటపాలెం
స్థానికంగా ఉన్న బియ్యం షాపులపై జిల్లా పౌరసరపరాల అధికారి విలియమ్స్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోతాలపై ఎంఆర్‌పి ధరలు లేకపోవడం, షాపు ముందు ధరల పట్టిక లేకపోవడం వంటి కారణాలతో మారుతి ట్రేడర్స్ షాపుకు రూ.10వేల అపరాధ రుసుం విధించినట్లు తెలిపారు. 26కేజీల వస్తాను తూకం వేస్తే 24కేజీల 600గ్రాములు మాత్రమే ఉన్నాయని తెలిపారు. బియ్యం నాణ్యతను పరిశీలించేందుకు శాంపిల్స్ సేకరించినట్లు చెప్పారు. ఈనెల 8న స్పందన ఫిర్యాదు అందినట్లు చెప్పారు. ప్రభుత్వ నిబంధనలు పాటించాలని దుకాణ దారులను హెచ్చరించారు. గతంలో సూచించినప్పటికీ మార్పు రాక పోవడంతో తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చీరాల తూనికలు కొలతల అధికారి నాగేశ్వరరావు, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ బెగ్, ఎన్ఫోర్స్మెంట్ డిటి ఓంకారం పాల్గొన్నారు.