తనిఖీలు చేస్తున్న జెసి
ప్రజాశక్తి-పాడేరు:రేషన్ షాపులలో కొలతల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ జె శివ శ్రీనివాసు డీలర్లను ఆదేశించారు. శుక్రవారం పాడేరు మండలం సుండ్రుపుట్టు చౌక ధరల దుకాణాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, చౌక ధరల దుకాణాల నిర్వాహకులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా చౌక ధరల దుకాణంలో నిల్వ ఉన్న స్టాక్‌ను జెసి పరిశీలించారు. పిఎంజికెఏవై ఉచిత బియ్యం పంపిణీపై ఆరా తీశారు. ఈ తనిఖీలో జిల్లా పౌరసరఫరాల అధికారి శివప్రసాద్, పౌర సరఫరాల కార్పొరేషన్ జిల్లా మేనేజర్ గణేష్ కుమార్, పౌర సరఫరాల ఉప తహసిల్దార్ ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.










