Feb 26,2023 00:08

తూకాలను పరిశీలిస్తున్న కాఫీ ఇఒ బాలంనాయుడు

ప్రజాశక్తి -హుకుంపేట:సంతల్లో వ్యాపారులు .బెట్టు కాటాలతో మోసాలకు పాల్పడితే సహించేది లేదని కాపీ ఈవో టీ.బాలం నాయుడు తెలిపారు. శనివారం వారపు సంతలో పర్యటించారు. గిరిజనులు అమ్మకానికి తెచ్చిన పంటలను పరిశీలించి వ్యాపారస్తులతో మాట్లాడారు. గిరిజనులు పండిస్తున్న పంటలను సరసమైన ధరలకు కొనుగోలు చేయాలని తెలిపారు. కాపీ పండ్లను పాడేరు ఐటిడిఏ సహకారంతో గిరిజన సహకార సంస్థ ఎకో పల్పింగ్‌ ద్వారా ప్రతి గ్రామంలో కొనుగోలు చేపట్టడం జరుగుతుందన్నారు. రాజ్మా చిక్కుళ్ళు కేజీ రూ.100 నుంచి 150, తిప్పలమోడీ రూ.350 నుంచి 400, పసుపు రూ.100 నుంచి 150, చెర్రీ రూ.150 నుంచి 180 వరకు కొనుగోలు చేయాలని తెలిపారు. కాపీ పండ్లు కేజీ రూ.36, కాపి గుళ్ల రూ. 135 నుంచి 150, పార్చి మెంట్‌. రూ. 270 నుంచి 300 చొప్పున కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపీ లైజన్‌ వర్కర్‌ కే వాసు దేవుడు, మత్య్స రాజు, శ్రీను సత్యానందం, ఆర్‌ సత్యనారాయణ, పి.రమేష్‌, చిన్నారావు, సన్నిబాబు, బొంజు బాబు, కాపు రైతులు పాల్గొన్నారు.