Mar 26,2023 23:08

సమావేశంలో మాట్లాడుతున్న రాము

ప్రజాశక్తి -గాజువాక : టూ వీలర్‌ మెకానిక్‌లను అసంఘటిత రంగ కార్మికులుగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్‌ టూ వీలర్‌ మెకానిక్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి జి.రాము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గాజువాకలో ఆదివారం ప్రగతి టూ వీలర్‌ మెకానిక్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ, అసోసియేషన్‌ సహకారంతో రాష్ట్ర స్థాయి సంఘంలో సభ్యత్వం తీసుకొని గుర్తింపు కార్డులు పొందాలన్నారు. దీని ద్వారా మెకానిక్‌లకు అనేక ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని తెలిపారు. టూ వీలర్‌ మెకానిక్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రచార కార్యదర్శి అప్పారి విష్ణుమూర్తి మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికులకు వర్తించే అన్ని పథకాలను టూ వీలర్‌ మెకానిక్‌లకు వర్తింప చేయాలని కోరారు. అసోసియేషన్‌ బలోపేతానికి మెకానిక్‌లంతా అండగా నిలవాలన్నారు. అనంతరం అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి రామును సత్కరించారు. ఈ సమావేశంలో స్థానిక అసోసియేషన్‌ అధ్యక్షుడు జి.దామోదర్‌రావు, వంగపండు గణేష్‌ , రెడ్డిపల్లి రాజు, జి.వెంకటేశ్వరరావు, చంటి, సోమేష్‌, నాయుడు తదితరులు పాల్గొన్నారు.