గుంటూరు: శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే, సందేశాత్మక తత్వ గీతంతో ఆధునిక భగవద్గీతను బోధించిన గొప్ప ప్రాకృతిక తాత్విక కవి జయరాజ్ అని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ అన్నారు. సెంటర్ ఫర్ సోషల్ సైకాలజీ, స్టెప్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అభ్యుదయ తాత్విక, ప్రకతి కవి జయరాజ్‌తో నగరంలోని పలువురు సాహితీ వేత్తలు, ప్రజా కవు లు, అభ్యుదయ రచయితలతో స్థానిక బ్రాడీపేట మాజేటి గురవయ్య కళా శాల సమావేశ మందిరంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జయ రాజు రచించిన 26 తత్వ గీతాల 'శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే' పుస్త కాన్ని ఆవిష్క రించిన అనం తరం మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ జయరాజు సాహిత్యంలో భారతీయ తత్వం, ప్రకృతి ఆరాధన, సర్వప్రాణుల సమానత్వం, మానవ జీవిత విలువలు పెనవేసు కొని ఉం టాయని ప్రశంసించారు. సభకు అధ్య క్షులు వహించిన సోషల్ సైకాలజీ అధ్య క్షులు ప్రొఫెసర్ నూతల పాటి అర వింద మాట్లాడుతూ ప్రస్తుతం విద్యా భ్యాసనలో విద్యా ర్థులకు పాఠ్యాం శాలతో పాటు మాన వీయ విలువలు, సంగీతము, సాహి త్యము, కళల పట్ల ఆసక్తి కలిగేలా తల్లి దండ్రులు పాఠశాల యాజమాన్యాలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్టెప్ సంస్థ వ్యవస్థాప కులు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు, కళాశాల ప్రిన్సి పల్ డాక్టర్ మంచాల బోసు బాబు, జెవివి నాయకులు కృష్ణయ్య, ప్రజా గాయకుడు పివి రమణ పాల్గొన్నారు










