Dec 19,2022 23:38

త్తైక్వాండో పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో కోచ్‌లు

ప్రజాశక్తి -తగరపువలస : స్థానిక సంగివలస అనిల్‌ నీరుకొండ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌ ఆవరణలో సోమవారం ఎపి అమెచ్యూర్‌ త్తైక్వాండో అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు బి ఆనందరావు పర్యవేక్షణలో త్తైక్వాండో మహిళా జట్టు ఎంపిక జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వంశీకృష్ణారెడ్డి తెలిపారు. డాక్టర్‌ వైఎస్సార్‌, యుహెచ్‌ఎస్‌ ఇంటర్‌ యూనివర్సిటీ త్తైక్వాండో ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో సంగివలస , అనిల్‌ నీరుకొండ దంత వైద్యకళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు.
57 కిలోల లోపు విభాగంలో డెంటల్‌ విద్యార్ధిని ఎల్‌.భువనేశ్వరి, 63 కిలోల విభాగంలో మెడిసిన్‌ విద్యార్ధిని ఆర్‌ ప్రసూన మెరుగైన ప్రతిభ కనబరిచారన్నారు. అమత్‌సర్‌లోని గురునానక్‌దేవ్‌ యూనివర్సిటీలో వచ్చేనెల 9 నుంచి 12వరకు జరగనున్న ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ ఉమెన్స్‌ త్తైక్వాండో పోటీలకు వీరిద్దరూ పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా కాలేజీలో విద్యార్థులిద్దరినీ సంస్థ ప్రధాన కార్యదర్శి డిజె భరత్‌రెడ్డి, సిఇఒనిరంజన్‌, మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాధామాధవ్‌ త్రిపాఠి, వైస్‌ ప్రిన్సిపల్స్‌ శ్రీధర్‌ రెడ్డి అనిల్‌ అభినందించారు. కార్యక్రమంలో ఎఒలు జెవిడి నాయుడు, శివప్రసాద్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ గున్నాజీ, త్తైక్వాండో కోచ్‌లు వినీష్‌, హేమంత్‌, శ్రీనాథ్‌ పాల్గొన్నారు.