ప్రజాశక్తి-చిన్నగొట్టిగల్లు(తిరుపతి) : శనివారం ఉదయం భాకరాపేట పోలీసులు జరిపిన మెరుపు దాడిలో బడా స్మగ్లర్ తాంజి తృటిలో తప్పించుకున్నాడని భాకరాపేట సిఐ తులసిరామ్ స్థానిక విలేకరుల సమావేశంలో అన్నారు. ఆయన వివరాల మేరకు స్థానిక చిట్టేచెర్ల పంచాయతీ, భూతంవారిపల్లి వద్ద వాహనాల్లో ఎర్రచందనాన్ని అక్రమరవాణా జరుగుతుందని తమకు రహస్య సమాచారం అందింది.భాకరాపేట ఎస్సై ప్రకాష్ కుమార్,సిబ్బందితో వెళ్ళగా సమాచారం ప్రకారమే రెండు వాహనాలు కనబడ్డాయి. తమ సిబ్బంది అప్రమత్తంమై చుట్టుముట్టి ఎనిమిది మంది తమిళ స్మగ్లర్లను పట్టుకొని విచారించాము.విచారణ లో బడా స్మగ్లర్ తాంజి అతని డ్రైవర్ తప్పించుకొన్నారు. ఘటనా స్థలంలో వున్న రెండు వాహనాల్లో ఒకదానిలో దుంగలు, మరో వాహనంలో రంపాలు,గొడ్డల్లు,కొడవల్లు వున్నాయి.వాహనాలతో సహా వీటి విలువ 22లక్షల వరకు వుంటుంది. తాంజి అనే బడా స్మగ్లర్ పై తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలలో సమారు 30ఎర్రచందనం కేసులు నమోదు అయినాయి. తాంజి ను పట్టుకోవడానికి దగ్గరలోనే మేము మా సిబ్బందితో కలిసి తమిళనాడుకు వెళతాము. పట్టుబడ్డ ఎనిమిది మంది తమిళ స్మగ్లర్లపై కేసు నమోదుచేసి రిమాండ్ కు తరలించాము.ఈకేసు దర్యాప్తు ముందుకు సాగుతుంది. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న తమిళనాడు స్మగ్లర్ల పై నిఘా పెట్టామని అన్నారు.










