Aug 22,2023 00:39

శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతున్న మేయర్‌

తృణధాన్యాలతో కేకు తయారీపై శిక్షణ
ప్రజాశక్తి -తిరుపతి సిటీ

అత్యధిక పోషక విలువలుగల తృణధాన్యాలతో ( మిల్లెట్స్‌ ) తో ఆరోగ్యకరమైన కేకులు, కుకీస్‌ తయారీ విధానంపై మహిళలకు అఖిల భారత మహిళా వ్యాపారవేత్తల సమాఖ్య ఆధ్వర్యములో రెండు రోజులు ఇచ్చే శిక్షణను సోమవారం ప్రారంభించారు. స్థానిక ఎం ఆర్‌ పల్లి సర్కిల్లోని బేకర్స్‌ బై బ్యాండ్‌ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి తిరుపతి మేయర్‌ డాక్టర్‌ శిరీష ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిరుపతి, ఏపీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సహకారముతో 21, 22 తేదీల్లో మహిళలకు తణధాన్యాలతో కేకులు తయారుచేయు విధానంపై శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. ఇలాంటి వాటిని మహిళలు సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా ఎదుగుతూ, సమాజానికి ఆరోగ్యవంతమైన ఆహార ఉత్పత్తులను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత మహిళా వ్యాపారవేత్తల సమాఖ్య అధ్యక్షులు రాధిక, కార్యదర్శి అపర్ణ, ఏపీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఉపాధ్యకులు కె.వి. చౌదరి, తిరుపతి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు కె.మోహన్‌ కుమార్‌ రాజు, కార్యదర్శి వాసుదేవన్‌, పి.మధుసూధన్‌ రావు, తిరుపతి లోని ఔత్సాహిక మహిళలు 102 మంది పాల్గొన్నారు.

శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతున్న మేయర్‌