బైక్ విడుదల చేస్తున్న షోరూమ్ మేనేజర్
ప్రజాశక్తి - విజయవాడ అర్బన్ : ఇటీవలే విడుదలైన ట్రయంఫ్ స్పీడ్ 400 మోటార్ బైక్‌ల డెలివరీలను ఆదివారం నుండి ప్రారంభించినట్లు ట్రయంఫ్ షోరూమ్ మేనేజర్ ప్రసాద్ తెలిపారు. ట్రయంఫ్ 400 ద్విచక్ర వాహనానికి యువత పట్ల అపూర్వ స్పందన లభిస్తుందని అన్నారు. ఎప్పటి నుండి డెలివరీల కోసం ఎదురుచూస్తున్న వారికి విజయవాడ నగరంలోని షోరూమ్‌లో డెలివరీలను అందిస్తున్నామని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా స్పీడ్ 400 వాహనాన్ని బుక్ చేసుకున్న కస్టమర్లకు తొలుత డెలివరీ అందిస్తున్నామని తరువాత షోరూమ్ బుకింగ్స్ ద్వారా అందించనున్నట్లు తెలిపారు. రానున్న కాలంలో ట్రయంఫ్ ఇంకా వేగవంతమైన బైక్‌లను రూపొందించనుందని తెలిపారు. ఈకార్యక్రమంలో వరుణ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు.










