ప్రజాశక్తి-విజయవాడ అర్బన్: ప్రతిఒక్కరూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ట్రయంప్ స్పీడ్ 400 బైక్‌ను విజయవాడ అడిషనల్ డిసిపి లక్ష్మీపతి గురువారం సాయంత్రం ట్రయంప్ షోరూమ్‌లో ఆవిష్కరించారు. ఈసందర్భంగా నూతన ట్రయంప్ స్పీడ్ 400 బైక్‌లను నగర మార్కెట్‌లోకి విడుదల చేశారు. అనంతరం లక్ష్మీపతి మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన ట్రయంప్ మోటార్ బైక్‌ల పట్ల యువత ఆసక్తి చూపుతున్నారని, వారికి అనుగుణంగా చక్కటి సదుపాయాలతో బైక్‌ను రూపుదిద్దుకుందని, తాను ఆవిష్కరించడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రొబైకింగ్ సర్కిల్ హెడ్ గౌతమ్ మోడీ మాట్లాడుతూ భారతీయ మోటార్ సైకిల్ పరిశ్రమకు ఒక ప్రతిష్టాత్మకంగా ఈబైక్ ఉంటుందని తెలిపారు. స్పీడ్ 400 బైక్‌తో తాము డీలర్ భాగస్వామితో కలసి బ్రాండ్ ట్రయంప్ ఔత్సాహిక రైడర్‌లకు సరైన ఎంపికగా మార్చే ప్రయాణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ట్రయంప్ సేల్స్ ప్లానింగ్ మేనేజర్ సాయి ప్రసన్న మాట్లాడుతూ ట్రయంప్ బైక్‌లను ఒరిజనల్ యాక్సెసరీస్‌తో తమకు కావాల్సిన రీతిలో మార్చుకోవచ్చని తెలిపారు. డీలర్‌షిప్ వద్ద స్పీడ్ 400 కోసం 25 కంటే ఎక్కువ అసలైన ఉపకరణాలు ఉన్నాయని తెలిపారు. స్టైలింగ్, సౌకర్యం నుండి సామాను, భద్రత వరకు, బైక్‌ను విస్రృత శ్రేణి రైడర్‌ల అవసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చని తెలిపారు. కొత్త కస్టమర్లు 16వేల కిలోమీటర్లు సర్వీస్ విరామాలతో రెండేళ్ల అపరిమిత మైలేజ్ వారంటీతో పాటు మరో మూడేళ్లు పొడిగించిన వారంటీని సైతం పొందుతారని అన్నారు. ట్రయంప్ స్పీడ్ 400 ఎక్స్‌షోరూమ్ ధర రు. 2.33 లక్షలు ధర నిర్ణయించినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో వరుణ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.వి. సత్యనారాయణ, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.










