కడప ప్రతినిధి : ''ఈయన పేరు సయ్యద్ హుస్సేన్, కడప నగరంలోని బెల్లంమండి వీధిలో నివాసం ఉంటున్నారు. రెండు నెలల కిందట ఇంటికి కరెంటు బిల్లు రూ.600 వచ్చేది. ప్రభుత్వం ట్రూఅప్ పేరిట వడ్డించిన వడ్డింపుల నేపథ్యంలో మేలో రూ.1251 బిల్లు వచ్చింది. ఇంత మొత్తంలో బిల్లు రావడానికి గల కారణాలు తెలుసుకోవడానికి విచారణ కేంద్రాన్ని సంప్రదించగా సర్వర్ పనిచేయడం లేదని, ఫోన్‌పే ద్వారా చెల్లింపులు చేయాలని బిల్ కలెక్టర్లు చెప్పడంతో నోరెళ్లబెట్టాల్సి వచ్చింది.''
జిల్లా ప్రజలకు ట్రూఅప్ షాక్ తగిలింది. ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కరెంటు ఛార్జీలను భారీగా పెంచేసింది. యూ నిట్‌కు సగటున మూడు దశలుగా 83 పైసల చొప్పున పెంచి, 36 నెలలు వసూలు చేయడానికి గ్రీన్‌సిగల్ ఇచ్చింది. జిల్లాపై రూ.2.5 కోట్ల మేర భారం పడింది. జిల్లాలోని నివాసగృహాలు మొదలుకుని వ్యవసాయ, కమర్షియల్, ఇండిస్టియల్, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠ శాలలు, దేవాలయ సర్వీసుల వరకు విద్యుత్ కనెక్షన్లన్నింటికీ కరెంటు ఛార్జీలను పెంచింది. ప్రభుత్వం పేద, ధనిక తారతమ్యాన్ని పాటించ కుండా ట్రూఅప్ ఛార్జీలను బాదేయడం విస్మయాన్ని కలిగిస్తోంది.
ఉమ్మడి జిల్లాలో 12,72,0,64 లక్షల విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. 9,46,166 లక్షల గృహాల విద్యుత్ కనెక్షన్లు, 1,04,208 వాణిజ్య కనెక్షన్లు, 7,522 పరిశ్రమల కనెక్షన్లు, 30,729 లక్షల ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, దేవాలయాల సర్వీసులు, 1.83,439 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. జిల్లాలో హెచ్‌విడిఎస్ 267 సబ్ స్టేషన్ల పరిధిలో ఆరు కేటగిరీలుగా విద్యుత్ కనెక్షన్లను విభజించారు. వీటిన్నింటి పరిధిలోని కనెక్షన్లన్నింటికీ ట్రూఅప్ ఛార్జీల పెంపును వర్తింపజేసింది. ఫలితంగా ప్రభుత్వానికి పేద, ధనికలనే తేడాలు లేకుండా ధనికులపై ప్రేమను ఒలకబోయడం తాను ధనికుల పక్ష పాతిని అనే ముద్రను స్థిరం చేసుకుందనే విమర్శను సుస్థిరం చేసు కుందని చెప్పవచ్చు.
2014 నాటి భారం షురూ!
2014 నుంచి 2019 వరకు వచ్చిన ఆర్థిక నష్టాలను భర్తీ చేయడంలో భాగంగా ట్రూఅప్ ఛార్జీలను పెంచేసింది. 2022 ఆగస్టు నుంచి 2025 జులై వరకు యూనిట్‌కు రూ.83 పైసలు చొప్పున పెంచేసింది. 2025 జులై వరకు ప్రతి నెలా ట్రూఅప్ పేరిట అదనపు ఛార్జీలను వసూలు చేయనుంది. 2023 మార్చిలో 10.96, మేలో 13.57 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగమైంది. మే నెలకు ట్రాన్స్‌కో ఆదాయం రూ.90.12 కోట్ల ఆదాయం లభించాల్సి ఉంది. 2023 ఏప్రిల్‌లో 11 లక్షల, మే 13.57 లక్షల యూనిట్లు వినియోగం కావడం గమనార్హం. జిల్లాపై సుమారు రూ.2.5 కోట్లకు పైగా భారం పడనుంది. నెలకు రూ.90.12 కోట్ల మేర ఆదాయం సమ కూరనుంది.
పేదలను కొట్టి..
ట్రూఅప్ ఛార్జీలు సామాన్యులను సమిదలుగా మార్చాయనే వాదన వినిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా బిపిఎల్ కేటగిరీ కింద ఎనిమిది లక్షల కుటుంబాల వరకు ఉన్న సంగతి తెలిసిందే. పేదల ప్రభుత్వమని చెప్పుకునే పాలకులు ఇటువంటి సామాన్యులను ఛార్జీల పెంపుదల నుంచి మినహాయించలేదు. ట్రూఅప్ ఛార్జీల పెంపు విషయంలో జిల్లాలోని 85 వేల కమర్షియల్ విద్యుత్ కనెక్షన్లు, 4,211 పరిశ్రమల విద్యుత్ కనెక్షన్ల మీద ట్రూ అప్ ఛార్జీల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం సముచితం. ఇటువంటి ఆలోచన చేయకుండా సామాన్య విద్యుత్ వినియోగదారుల మీద ట్రూఅప్ ఛార్జీల భారాన్ని వేయడం పట్ల సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది.
గత పెంపుదలకు భిన్నంగా
గత కరెంటు ఛార్జీల పెంపునకు భిన్నంగా ఛార్జీలను పెంచింది. గతంలో కరెంటు ఛార్జీల పెంపుదలను పరిశీలిస్తే శ్లాబ్ రేట్ల ప్రకారం పెంచేయడం తెలిసిందే. దీన్నిబట్టి గమనిస్తే పేదల విద్యుత్ వినియోగం పరిమితం. దీన్నిబట్టి పేదలపై భారం పరిమితంగానే ఉండేది. తాజా ట్రూ అప్ ఛార్జీల విషయంలో పేద, ధనిక కనెక్షన్లనే తార తమ్యం లేకుండా ఛార్జీల పెంపు అనివార్యమైంది. జిల్లాలోని కమర్షియల్, విద్యుత్ కనెక్షన్లపై ట్రూఅప్ ఛార్జీలను వసూలు చేయడానికి బదులుగా కరెంటు కనెక్ష న్లన్నింటికీ ఛార్జీలను పెంచడంపై విమర్శల వర్షం కురుస్తోంది. టెలిస్కోపిక్ వినియోగదారులకు వాత పెట్టనుందని అర్థమవుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ హయాంలో దళిత కాలనీల్లో ఒక బల్బును ఉప యోగించుకునే అవకాశం కల్పించింది. ప్రస్తుత ప్రభుత్వం వైఎస్‌ఆర్ ఎస్‌సిలకు ప్రవేశపెట్టిన ఒక బల్బు ఉచిత విద్యుత్ వినియోగ పథకానికి కాలనీల పరిమితం పేరుతో తిలోదకాల్చింది. ఫలితంగా లక్ష మందికిపైగా ఒక బల్బు లబ్ధిదారులు నష్టపోవడం తెలిసిందే.










