పల్నాడు జిల్లా: ప్రజలకు భారంగా మారిన విద్యుత్ ఛార్జీలను తక్ష ణమే ఉపసంహరించుకోకపోతే అన్ని ప్రజా సంఘాలను వామపక్షాలను కలిసొచ్చే రాజకీయ పార్టీలతో విద్యుత్ ఉద్యమంతో వైసిపి ప్రభుత్వానికి బుద్ది చెప్పి గద్దె దింపు తామని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ హెచ్చరించారు. స్థానిక గాంధీ పార్క్ వద్ద పౌర హక్కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 5 నుండి చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం ముగి శాయి. ఈ సందర్భంగా దీక్షా శిబిరం వద్ద నుండి పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు చేపట్టిన ర్యాలీలో అన్ని ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి సిలార్ మసూద్ అధ్యక్షత వహించారు. గుంటూరు విజరు కుమార్ మాట్లాడుతూ 2014 నుండి సర్దుబాటు చార్జీల పేరుతో విద్యుత్ చార్జీలు పెంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్నారు. టిడిపి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలతో ప్రజలను దోచు కుంటుందని 'బాదుడే బాదుడు' అంటూ అపహాస్యం చేసిన జగన్మోహన్ రెడ్డి విద్యుత్ చార్జీలు పెంచడం దుర్మార్గ మన్నారు. విద్యుత్ ఛార్జీలు సర్ చార్జీలు, కస్టమర్ చార్జీల పేరుతో వైసిపి ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ చార్జీల పేరిట 11 సార్లు విద్యుత్ ఛార్జిలు పెంచిన చరిత్ర వైసి పికి దక్కు తుందని దుయ్యబట్టారు. అనంతరం రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు,మహిళ నాయకురాలు విమల, నాయకులు ఎస్.ఆంజనేయ నాయక్, ఎం. సిపిఐయు జిల్లా కార్యదర్శి రెడ్ భాష,బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గోదా జాన్ పాల్, ఎస్.సి ఎస్టీ, ముస్లిం మైనారిటీ ఐక్య వేదిక జాతీయ అధ్యక్షులు పి.పూర్ణచంద్రరావు ప్రసంగిస్తూ ప్రజలకు భారంగా మారిన విద్యుత్ చార్జీలను తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోకుంటే బషీరాబాద్ తర హాలో విద్యుత్ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. మోడీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడానికి చేస్తున్న ప్రయత్నాలు కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. బిజెపి ప్రభుత్వ సానుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో వ్యవసాయ మోటార్లకు మీటర్లతో పాటు గృహాలకు స్మార్ట్ మీటర్లు బిగించేందుకు అదాని సంస్థకే అప్పచెప్పారని, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం తనపై ఉన్న కేసుల నుండి బయటపడడానికి అత్యు త్సాహంతో స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ఒప్పుకున్నారని విమర్శించారు. స్మార్ట్ మీటర్ల వలన విద్యుత్ వినియోగ దారులపై మోయలేని భారాలు వేసే పరిస్థితి ఏర్పడుతుం దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జిలను తక్షణమే తగ్గించాలని స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసిపి ప్రభుత్వం ప్రజా ఆగ్రహాన్ని చూడకముందే పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ప్రజలు చైతన్యవంతం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్.వేంకటేశ్వర రాజు, కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు క.రామారావు, వై.రాధాకృష్ణ, నాయ కులు కోండ్రు ఆంజనేయులు మేడం ఆంజనేయులు,షేక్ మస్తాన్ వలి, రామకృష్ణ, షేక్ సుభాని, ఖాసీం, మహిళ నాయకులు శివకుమారి, నాగమ్మ భారు,ఫాతిమా పాల్గొన్నారు.










