Oct 09,2023 23:33

ప్రజాశక్తి - బాపట్ల
తరతరాల చరిత్రకు తపాలా బిళ్ళలు సాక్షాలుగా నిలుస్తాయని హెడ్ పోస్ట్ మాస్టర్ జివి సత్యనారాయణ అన్నారు. ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రధాన తపాలా కార్యాలయంలో ఫోరం ఫర్ బెటర్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన తపాలా బిళ్ళల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. సత్యనారాయణ మాట్లాడుతూ అనేక చారిత్రక ఘట్టాలను, విశేషాలను తపాలా బిళ్ళల ద్వారా  తెలుసుకోవచ్చని తెలిపారు. మహనీయుల చిత్రాలను దర్శించవచ్చని అన్నారు. తపాలా బిళ్ళల సేకరణ ద్వారా నేటి విద్యార్థులకు, చిన్నారులకు ఎన్నో విషయాలను అవగతం చేయవచ్చని అన్నారు. వారిలో సామాజిక దృక్పథం పెంపొందుతుందని అన్నారు. ప్రదర్శనను పాస్ పోర్ట్ కార్యాలయానికి, తపాలా కార్యాలయానికి విచ్చేసిన పలువురు సందర్శించి తిలకించారు. కార్యక్రమంలో ఫోరం కార్యదర్శి పిసి సాయిబాబు, నందా ఆంజనేయదత్తు, ఎపీఎం పి నరసింహారావు, సిపిసి డి నాగరాజు పాల్గొన్నారు.