ప్రజాశక్తి-కాకినాడ రూరల్ ట్రస్ట్ మల్టీ హాస్పిటల్ తన మొదటి లీడ్‌లెస్ పేస్‌మేకర్ ఇన్‌సర్షన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ అత్యాధునిక ప్రక్రియను కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్(అమెరికా) డాక్టర్ ఇలానా బి.కుటిన్స్కీ, డాక్టర్ చంద్ర మౌళి, క్యాథ్ ల్యాబ్ బందం నిపుణులు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ లీడ్‌లెస్ పేస్‌మేకర్ ఒక వినూత్న వన్-పీస్ పరికరమని, ఇది సిర ద్వారా గుండెలోకి అమరుస్తామన్నారు. ఇది చర్మం కింద ప్రత్యేక బ్యాటరీ అవసరాన్ని తొలగిస్తూ రోగి సౌలభ్యం భద్రతలో గణనీయమైన పురోగతిని సూచిస్తుందన్నారు. అత్యాధునిక వైద్య సేవలను అందించడంలో ట్రస్ట్ మల్టీ హాస్పిటల్ ముందంజలో ఉందన్నారు. రోగులకు ఉన్నతమైన సంరక్షణను అందించడానికి వైద్య సాంకేతికతలో తాజా పురోగతులను చేర్చడానికి అహర్నిశలు కషి చేస్తూ ఎన్నో విజయాలను సాధిస్తుందని వారు తెలిపారు.










