ప్రజాశక్తి-ఉక్కునగరం : ఎంప్లాయీస్ త్రిఫ్ట్ సొసైటీకి అక్టోబర్ 29వ తేదీన జరగునున్న ఎన్నికలకు సంబంధించి సిఐటియు ప్యానెల్‌ను ప్రకటించారు. కె.శ్రీనివాస్ (మిల్స్), ఆనందరావు (సిఒసిసిపి), లాలూ (క్యూఎటిడి), ఎంవి.రమణ (ఎస్‌ఎంఎస్), డిఎస్‌ఆర్‌సి మూర్తి (సింటర్ ప్లాంట్)ని సిఐటియు ప్యానెల్ అభ్యర్థులుగా ప్రకటించారు. ఈ సందర్భంగా స్టీల్ సిఐటియు అధ్యక్షులు జె.అయోధ్యారామ్ మాట్లాడుతూ, గతంలో 4 సార్లు సిఐటియు పాలకవర్గం త్రిఫ్ట్ సొసైటీ వ్యాపారాన్ని పారదర్శకంగా నిర్వహించిందని గుర్తుచేశారు. సిఐటియు పాలకవర్గం సొసైటీ అభివృద్ధికి పాటుపడినట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో సిఐటియు ప్యానెల్‌లో పాలకవర్గం 35 శాతం డివిడెంట్ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో మిగిలిన సొసైటీల కంటే ఇది ఎక్కువ అన్నారు. రూ.10 లక్షల మేర లోన్ సౌకర్యాన్ని తమ పాలకవర్గం అందించిందని తెలిపారు. రాష్ట్రంలో అనేక సొసైటీలు మూతపడుతున్నప్పటికీ స్టీల్‌ప్లాంట్ త్రిఫ్ట్ సొసైటీ నిజాయతీ, పారదర్శకత వల్ల అభివృద్ధిలో కొనసాగుతుందన్నారు. సొసైటీ మరింత అభివృద్ధి చెందాలంటే సిఐటియు ప్యానెల్‌ను మరోసారి గెలిపించాలని కోరారు.










