నేడే ఎన్నికలు
ప్రజాశక్తి -గాజువాక : భెల్‌లో ఈనెల 23న జరగనున్న త్రిఫ్ట్ సొసైటీ ఎన్నికల్లో సిఐటియు ప్యానల్‌ను గెలిపించాలని, బిహెచ్‌ఇఎల్ సిఐటియు ప్రధానకార్యదర్శి జిటిపి ప్రకాష్ కోరారు. బుధవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సిఐటియు ప్యానెల్‌లో తనతోపాటు కె.విజరుకుమార్, ఎస్.అప్పారావు, కె.నారపరెడ్డి, జి.రాంబాబు, పి కనకారావు, పి శివరాం, బి కృష్ణమూర్తి అభ్యర్థులుగా పోటీలో ఉన్నారన్నారు. త్రిఫ్ట్ సొసైటీలో సిఐటియు ప్యానెల్ విజయం సాధిస్తే సభ్యులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంతోపాటు దాచుకున్న డబ్బుపై ప్రస్తుతమున్న దానికంటే అధిక వడ్డీతోపాటు, సభ్యులు తీసుకున్న రుణాలు, డిపాజిట్లుపై వడ్డీ తేడా ఒకశాతం మాత్రమే ఉండేలా చర్యలు చేపడతామన్నారు. సభ్యులకు బీమా సౌకర్యం కల్పిస్తామని, సొసైటీని లాభాల బాటలో నడిపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సహకార స్ఫూర్తితో సభ్యులకు అత్యవసర రుణాలు మంజూరు. హెచ్‌పిఇపిలోని 700మందిలో500మంది మాత్రమే సభ్యులుగా ఉండగా, కార్మికులందరికీ సభ్యత్వం కల్పిస్తామన్నారు.సమర్థులైన సిఐటియు ప్యానెల్‌ను గెలిపించాలని అభ్యర్థించారు.










